BHPL: సోషల్ మీడియాలో ద్వేషపూరిత వ్యాఖ్యలు చేయడం చట్టవిరుద్ధమని మహదేవపూర్ CI వెంకటేశ్వర్లు హెచ్చరించారు. కులం, మతం, వర్గాలపై విద్వేషం రెచ్చగొట్టే పోస్టులు, సందేశాలు పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. తప్పుడు సమాచారం ప్రచారం చేయడం వల్ల సమాజంలో అశాంతి నెలకొనే ప్రమాదం ఉందన్నారు. ప్రజలు బాధ్యతాయుతంగా సోషల్ మీడియాను వినియోగించుకోవాలన్నారు.