KRNL: వెల్దుర్తిలోని అంగన్వాడీ స్కూల్ నెంబర్-1ను జిల్లా కలెక్టర్ ఏ.సిరి ఇవాళ ఆకస్మికంగా తనిఖీ చేశారు. కేంద్రంలో అందుతున్న సేవలు, పిల్లలకు ఇస్తున్న పోషకాహారం, హాజరు నమోదు పత్రాలను పరిశీలించారు. పిల్లల ఆరోగ్యం, శుభ్రతపై ప్రత్యేక దృష్టి పెట్టాలని సిబ్బందికి సూచించారు. అలాగే అంగన్వాడీ కేంద్రాల్లో ప్రభుత్వ పథకాలు సమర్థంగా అమలుకావాలని ఆదేశించారు.