BDK: జాతీయ స్థాయి రెజ్లింగ్ పోటీలలో వెంకట ప్రసాద్ పాల్గొనగా తీవ్ర గాయాల పాలై విశ్రాంతి తీసుకుంటున్నారు. శుక్రవారం విషయం తెలుసుకున్న కొత్తగూడెం ఎమ్మెల్యే కూనంనేని సాంబశివరావు క్రీడాకారున్ని చరవాణి ద్వారా పరామర్శించారు. త్వరగా కోలుకొని మళ్ళీ పోటీలో పాల్గొనే సత్తా చాటాలని అన్నారు. ప్రభుత్వం తరఫున సహాకారాలు అందజేస్తామని ఎమ్మెల్యే హామీ ఇచ్చారు