KMR: మాచారెడ్డి మండలంలోని చుక్కాపూర్ లక్ష్మీనరసింహస్వామి ఉత్సవాలు ఇవాళ అంగరంగ వైభవంగా ప్రారంభమయ్యాయి. తొమ్మిది రోజుల పాటు ఈ వేడుకలు కొనసాగుతాయని ఆలయ కమిటీ ఛైర్మన్ కమలాకర్ రెడ్డి తెలిపారు. ఉత్సవాల సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఆలయానికి వచ్చే భక్తులకు ఎటువంటి ఇబ్బందులు కలగకుండా అన్ని ఏర్పాట్లు పూర్తి చేసినట్లు ఆయన వెల్లడించారు.