KMM: మధిర మున్సిపాలిటీ అంబర్పేటలో గురువారం ఉచిత కంటి వైద్య శిబిరాన్ని మున్సిపల్ ఛైర్మన్ సామినేని సుజాత ప్రారంభించారు. జిల్లా వైద్య ఆరోగ్య శాఖ సూచనలతో దెందుకూరు పీహెచ్సీ వైద్యులు, ఏరియా హాస్పిటల్ నిపుణుల ఆధ్వర్యంలో శిబిరం నిర్వహించారు. ప్రజలు ఈ అవకాశాన్ని సద్వినియోగం చేసుకోవాలని సూచించారు.