TATA మోటార్స్ తమ లగ్జరీ కార్లు జాగ్వార్, ల్యాండ్ రోవర్లను రీకాల్ చేస్తున్నట్లు ప్రకటించింది. అమెరికా మార్కెట్లో 1.70 లక్షల వాహనాల రీకాల్ ప్రకటన అంతర్జాతీయ ఆటోమొబైల్ రంగంలో, స్టాక్ మార్కెట్లో కలకలం రేపింది. వాహనాల్లోని ఫ్రంట్ సస్పెన్షన్ సిస్టమ్లో సాంకేతిక లోపమే కారణం. దీంతో భారత స్టాక్ మార్కెట్లో టాటా మోటార్స్ షేర్లు 4.5% నుంచి 5.3% వరకు పతనమయ్యాయి.