TG: ఆర్టీసీ కార్మికుల సమ్మె తీవ్రరూపం దాల్చుతున్న వేళ జేఏసీ నేతలు ఇవాళ అత్యవసరంగా సమావేశం కాబోతున్నారు. ప్రభుత్వం నియమించిన మంత్రుల కమిటీ చర్చలకు పిలిచిన నేపథ్యంలో JAC తీసుకోబోయే నిర్ణయంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. ప్రభుత్వం నుంచి సరైన హామీ లేనిదే వెనక్కి తగ్గకూడదని భావిస్తున్న జేఏసీ.. ఇవాళ మంత్రుల బృందంతో భేటీ కావాలా.. వద్దా? అన్న విషయంపై నిర్ణయం తీసుకోనుంది.