మార్కాపురం జిల్లా అకుంఠిత దీక్ష పట్టుదలకు మారుపేరు భగీరథ మహర్షి అని కలెక్టర్ విజయ సునీత చెప్పుకొచ్చారు. గురువారం మహర్షి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలవేసి నివాళులర్పించారు. బ్రహ్మదేవుని ప్రత్యక్షం కోసం ఒంటి కాలుపై తపస్సు చేసి గంగను భూమి పైకి తెప్పించడంలో ఆయన సఫలీకృతుడయ్యరని ఆమె వివరించారు.