VZM: మునిసిపల్ కమిషనర్ బాలస్వామి గురువారం విజయవాడలో ప్రభుత్వ సత్కారం అందుకున్నారు. 2025-26 ఆర్థిక సంవత్సరంలో మునిసిపల్ పరిధిలో పన్నులు వసూళ్లలో అధికవృద్ధి రేటు సాధించినందుకు గానూ రాష్ట్ర పురపాలక శాఖ సెక్రటరీ సురేశ్ కుమార్ ఆయనకు ప్రశంసా పత్రాన్ని అందించి సత్కరించారు. అనంతరం కమీషనర్ మాట్లాడుతూ.. రెవెన్యూ సిబ్బంది సహకారంతోనే ఈ ఘనత సాధించామన్నారు.