SGR: మండలం మల్కాపూర్‌లో వివిధ దినపత్రికలు పంపిణీ చేసే 27 మంది పేపర్ బాయ్‌లకు టీపీసీసీ వర్కింగ్ ప్రెసిడెంట్ జగ్గారెడ్డి గురువారం సైకిళ్లను అందజేశారు. సైకిళ్ల కోసం దాదాపు 500 మంది విద్యార్థులు దరఖాస్తు చేసుకున్నారని ఆయన తెలిపారు. చదువు మధ్యలో ఆపేసిన వారికి స్థానిక పరిశ్రమల్లో ఉపాధి కల్పించేలా చర్యలు తీసుకుంటామని జగ్గారెడ్డి భరోసా ఇచ్చారు.