PDPL: రిజిస్ట్రేషన్ లేకుండా ఆసుపత్రులు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని DMHO డా. ప్రమోద్ కుమార్ హెచ్చరించారు. జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు ఇటీవల రామగుండం పట్టణంలో కంటి ఆసుపత్రులను తనిఖీ చేయగా, 2 ఆసుపత్రులకు అనుమతులు లేనట్లు గుర్తించామని తెలిపారు. వారికి నోటీసులు జారీ చేశామన్నారు. 2010 చట్టం ప్రకారం అనుమతులు లేని వాటిపై తగిన చర్యలు తీసుకుంటామన్నారు.