ATP: గుంతకల్లులోని పలు ఇండ్లలో చోరీ చేసిన కేసుల్లో గురువారం ఇద్దరు దొంగలను పోలీసులు అరెస్టు చేశారు. వన్ టౌన్ సిఐ మనోహర్ మాట్లాడుతూ.. పలుచోరీ కేసుల్లో ఇద్దరు ముద్దాయిలను అరెస్టు చేసి వారి వద్ద నుంచి 72 గ్రాముల బంగారం, రూ.5 లక్షల నగదును స్వాధీనం చేసుకుని సీజ్ చేశామన్నారు. అనంతరం ముద్దాయిలను కోర్టుకు హాజరపరచామన్నారు.