ప్రకాశం: సీఎస్ పురం మండలం కొత్తపల్లి జంక్షన్ వద్ద గురువారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటుచేసుకుంది. శీలంవారిపల్లి గ్రామానికి చెందిన గురుబాబు పామూరు నుంచి తన స్వగ్రామానికి వెళ్తుండగా బైక్ అదుపుతప్పి డివైడర్ను ఢీ కొట్టాడు. ఈ ఘటనలో అతనికి తీవ్ర గాయాలయ్యాయి. స్థానికులు 108 అంబులెన్స్ ద్వారా పామూరు ప్రభుత్వ వైద్యశాలకు చేర్చినట్లు తెలిపారు. పూర్తి వివరాలు తెలియాల్సి ఉంది.