ఉభయ తెలుగు రాష్ట్రాల్లోని స్కూళ్లకు ఇవాళ్టి నుంచి వేసవి సెలవులు ప్రారంభమయ్యాయి. దీంతో జూన్ 11 వరకు మూతపడనున్న స్కూళ్లు.. 12న పునఃప్రారంభమవుతాయి. ఈ సెలవులు ప్రైవేట్, ఎయిడెడ్ స్కూళ్లకూ వర్తిస్తాయని అధికారులు స్పష్టంచేశారు. ఇక గురువారం చివరి పనిదినం కావడంతో విద్యార్థులకు ప్రోగ్రెస్ కార్డులు అందజేశారు. వేసవి సెలవుల్లో పిల్లల భద్రతకు తగు జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు.