GNTR: రీసర్వే పూర్తయిన గ్రామాల్లో పట్టాదార్ పాస్ పుస్తకాల జారీ ప్రక్రియను వేగవంతం చేయాలని కలెక్టర్ సి.యం. సాయి కాంత్ వర్మ అధికారులను ఆదేశించారు. ఈ-కేవైసీ ప్రక్రియను త్వరితగతిన పూర్తి చేసి అర్హులైన రైతులకు పాస్ పుస్తకాలు అందేలా చర్యలు తీసుకోవాలని సూచించారు. నిన్న కలెక్టరేట్ నుంచి వీడియో కాన్ఫరెన్స్ ద్వారా సమీక్ష నిర్వహించారు.