VKB: కొడంగల్ మండలం చిన్ననందిగామలో ఉపాధి హామీ పనుల వద్ద సర్పంచ్ దత్తాత్రేయరావు పర్యటించారు. పెరుగుతున్న ఎండల దృష్ట్యా కూలీలు వడదెబ్బకు గురికాకుండా ఉండాలని వారికి ఓఆర్ఎస్ ప్యాకెట్లు, మంచినీళ్లు పంపిణీ చేశారు. పని ప్రదేశంలో తగిన జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. ఈ కార్యక్రమంలో బలవంత్ రెడ్డి, అబ్దులప్ప, ఫీల్డ్ అసిస్టెంట్ నారాయణ, ఏఎన్ఎం రాములమ్మ పాల్గొన్నారు.