ADB: వడ్డీ వ్యాపారంతో అమాయకమైన ప్రజలను మోసం చేస్తే కఠిన చర్యలు తప్పవని SP అఖిల్ మహాజన్ హెచ్చరించారు. శుక్రవారం జిల్లాలోని 15 పోలీస్ స్టేషన్ పరిధిలో 45 మంది సిబ్బందితో కలిసి ఏకకాలంలో దాడులు నిర్వహించారు. ఈ సందర్భంగా రైతులు, ప్రజల నుంచి వారి అవసరాలను ఆసరాగా తీసుకుని అధిక వడ్డీని వసూలు చేస్తున్న వారిపై కేసును నమోదు చేసినట్లు SP తెలియజేశారు.