KRNL: ఆదోనిలో కల్తీ కల్లు అక్రమ వ్యాపారంపై కఠిన చర్యలు తీసుకోవాలని ఇవాళ AIYF నేతలు డిమాండ్ చేశారు. ఎక్సైజ్ కార్యాలయం ముందు ధర్నా నిర్వహించి, ఇన్స్పెక్టర్కు వినతిపత్రం అందజేశారు. కల్తీ మద్యం వల్ల పేద ప్రజలు అనారోగ్యానికి గురవుతున్నారని నాయకులు ఆందోళన వ్యక్తం చేశారు. ప్రత్యేక దాడులు చేపట్టి కేంద్రాలను మూసివేసి, బాధ్యులపై కఠిన చర్యలు తీసుకోవాలని కోరారు.