WNP: నేటి అంగన్వాడీ కేంద్రాలు విజ్ఞాన భాండాగారాలుగా వీరాజిల్లుతున్నాయని వనపర్తి సీడీపీఓ హాజీరా బేగం అన్నారు. ఇవాళ రేవల్లి మండలంలోని అంగన్వాడీలో నిర్వహించిన 8వ పోషక్ పక్వాడా కార్యక్రమానికి ఆమె హాజరై కేంద్రాల కార్యకలాపాలను పరిశీలించారు. ఆమె మాట్లాడుతూ.. అంగన్వాడీ కేంద్రాలు ప్రతి ఒక్కరి జీవితంలో మర్చిపోలేని విజ్ఞాన భాండాగారాలు అని అభివర్ణించారు.