PDPL: జిల్లాలో కలెక్టర్ శ్రీ హర్ష ఇవాళ సుడిగాలి పర్యటన చేశారు. ఇందులో భాగంగా GDK జనరల్ ఆసుపత్రిని ఆకస్మిక తనిఖీ చేశారు. జంగాలపల్లిలో నిర్మించిన డబుల్ బెడ్ రూమ్ ఇళ్లను పరిశీలించి, త్వరగా లబ్ధిదారులకు అందజేయాలని సూచించారు. పట్టాలు పొందిన వారికి ఇళ్లు మంజూరు చేయాలని ఆదేశించారు. RGM కార్పొరేషన్ కార్యాలయంలో అధికారులతో సమీక్షించారు. ఆర్డీవో గంగయ్య, తహసీల్దార్ ఆయన వెంట ఉన్నారు.