KMR: జిల్లాలో ఓపెన్ పది, ఇంటర్ పరీక్షలు నేడు ప్రశాంతంగా జరిగాయి. ఓపెన్ పదో తరగతికి జరిగిన సోషల్ స్టడీస్ పరీక్షకు 6 పరీక్షా కేంద్రాల్లో 1,021 మందికి గాను 889 (88%)మంది హాజరు కాగా 122 మంది గైర్హాజరయ్యారని DEO రాజు వెల్లడించారు. ఓపెన్ ఇంటర్‌కు జరిగిన హిస్టరీ పరీక్షకు 8 పరీక్షా కేంద్రాల్లో 543 మందికి 487 (90%) మంది హాజరు కాగా 56 మంది గైర్హాజరయ్యాన్నారు.