KNR: కాంగ్రెస్ ప్రభుత్వం ఇందిరమ్మ ఇళ్లతో పేదల సొంతింటి కలను నిజం చేస్తోందని హుజురాబాద్ నియోజకవర్గ ఇంఛార్జ్ వొడితల ప్రణవ్ అన్నారు. ఆదివారం వీణవంక మండలం కనపర్తి, ఘన్ముక్ల, నరసింహులపల్లి గ్రామాల్లో నూతన ఇందిరమ్మ ఇళ్ల గృహప్రవేశాలకు ఆయన హాజరయ్యారు. లబ్ధిదారులు ఆయనకు ఘనస్వాగతం పలికారు. త్వరలోనే అర్హులైన మిగిలిన వారికి రెండో విడత ఇళ్లు మంజూరు చేస్తామన్నారు.