WNP: జనగణన 2027లో భాగంగా నిర్వహించనున్న స్వీయ జనగణన (సెల్ఫ్ ఎన్యూమరేషన్) కార్యక్రమంలో ప్రతి ఒక్కరూ తప్పనిసరిగా పాల్గొనాలని జిల్లా కలెక్టర్ ఆదర్శ్ సురభి పిలుపునిచ్చారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. ప్రజలు ప్రభుత్వం అందుబాటులో ఉంచిన వెబ్సైట్ https://se.census.gov.in ద్వారా స్వయంగా తమ వివరాలను నమోదు చేసుకోవచ్చని తెలిపారు.