కరీంనగర్లో సోషల్ మీడియాలో తప్పుడు వైద్య సమాచారాన్ని ప్రచారం చేస్తున్న వైద్యులపై క్రిమినల్ కేసులు నమోదు చేసి, వారి లైసెన్సులు రద్దు చేయాలని డీవైఎఫ్ఎ జిల్లా కార్యదర్శి నరేష్ పటేల్ డిమాండ్ చేశారు. చిట్కాలతో దీర్ఘకాలిక వ్యాధులు నయమవుతాయని నమ్మించి రోగుల ప్రాణాలతో చెలగాటమాడుతున్నారని మండిపడ్డారు. ప్రైవేట్ ఆసుపత్రుల దోపిడీని అరికట్టాలని కోరారు.