GDWL: దోమల నివారణతో మలేరియాకు అడ్డుకట్ట వేయవచ్చని గద్వాల అడిషనల్ కలెక్టర్ నర్సింగరావు పేర్కొన్నారు. ప్రపంచ మలేరియా దినాన్ని పురస్కరించుకొని శనివారం వైద్య ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో పాత డీఎంహెచ్వో కార్యాలయం వద్ద జెండా ఊపి అవగాహన ర్యాలీని ప్రారంభించారు. అనాఫిలిస్ అనే ఆడదోమ కుట్టడం వల్ల మలేరియా సోకుతుందన్నారు. పరిసరాల్లో నీరు నిల్వ ఉండకుండా చూసుకోవాలన్నారు.