కళ్లజోడు మచ్చలను తగ్గించుకోవడానికి కొన్ని చిట్కాలు పాటించడం మంచిది. రోజూ పడుకునే ముందు మచ్చలపై అలోవెరా జెల్ రాసి మసాజ్ చేయాలి. దూదితో నిమ్మరసాన్ని మచ్చలపై అద్ది, 10 నిమిషాల తర్వాత కడిగేయాలి. కీరదోస ముక్కలను మచ్చలపై రుద్దడం వల్ల చర్మం చల్లబడి మచ్చలు తగ్గుతాయి. తేనె, పాలు కలిపి రాస్తే చర్మం మృదువుగా మారుతుంది. ముఖ్యంగా ఫ్రేమ్ ముక్కుపై ఒత్తిడి పడకుండా చూసుకోవాలి.