నంద్యాల జిల్లాలో పెట్రోల్ బంకులు తాత్కాలికంగా మూసివేయడంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొన్నారు. కడప నుంచి ఇంధన సరఫరా ఆలస్యం కావడం, భద్రత సమస్యల కారణంగా బంకులు నిలిపివేశారు. శుక్రవారం కలెక్టర్ రాజకుమారి వెంటనే స్పందించి పోలీస్ బందోబస్తు ఏర్పాటు చేసి ఇంధనం పంపిణీకి ఆదేశించడంతో బంకులు తిరిగి ప్రారంభమయ్యాయి.