TG: వరంగల్ జిల్లా ముత్తోజిపేటలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మరణించిన ఆర్టీసీ డ్రైవర్ శంకర్ గౌడ్ మృతదేహాన్ని నర్సంపేట డిపోకు తరలించేందుకు కార్మికులు ప్రయత్నించగా పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో ఇరువర్గాల మధ్య తోపులాట జరగడంతో గంటకుపైగా మృతదేహం రోడ్డుపైనే ఉండిపోయింది. దీనివల్ల కిలోమీటర్ల మేర ట్రాఫిక్ నిలిచిపోయింది. చివరకు పోలీసులు మృతదేహాన్ని ఆయన కుమార్తె ఇంటికి తరలించారు.