SRPT: జిల్లా పోలీసు కార్యాలయంలో ఏఎస్ఐ సత్యనారాయణ కుటుంబానికి ఎస్బీఐ ‘శాలరీ ప్యాకేజీ’ ఇన్సూరెన్స్ కింద రూ.10 లక్షల చెక్కును ఎస్పీ నరసింహ అందజేశారు. పోలీసు సిబ్బంది అందరూ ఈ ప్యాకేజీని పొందాలని, ఆరోగ్యం, ప్రయాణాల్లో జాగ్రత్తలు పాటించాలని ఆయన సూచించారు. ఈ కార్యక్రమంలో అదనపు ఎస్పీ రవీందర్ రెడ్డి, బ్యాంక్ అధికారులు, పోలీసు సంఘం ప్రతినిధులు ఉన్నారు.