SDPT: జగదేవ్పూర్ మండలం వట్టిపల్లి గ్రామ శివారులో ఉపాధి హామీ పథకంలో భాగంగా చేపట్టిన బాట విస్తరణ పనులు శుక్రవారం వేగంగా సాగాయి. వేసవిలో కూలీలకు పని కల్పించడమే లక్ష్యంగా ఈ పనులను ముమ్మరం చేశారు. ఫీల్డ్ అసిస్టెంట్ రమేష్ పనులను పర్యవేక్షించి, కూలీల హాజరు నమోదు చేశారు. రహదారి విస్తరణలో ఇబ్బందులు కలగకుండా తగు సూచనలిచ్చారు. కార్యక్రమంలో ఉపాధి కూలీలు పాల్గొన్నారు.