కరోనా వైరస్ మానవ కణాల్లోకి ప్రవేశించే మరో కొత్త మార్గాన్ని శాస్త్రవేత్తలు కనుగొన్నారు. ఆఫ్రికా గబ్బిలాల్లోని ‘CcCoV-KY43’ అనే వైరస్, మన ఊపిరితిత్తుల్లో ఉండే ‘CEACAM6’ అనే ప్రోటీన్ ద్వారా శరీరంలోకి చేరుతుందని గుర్తించారు. ఇది వైరస్ వ్యాప్తిపై కొత్త అవగాహనను కలిగిస్తోంది. భవిష్యత్తులో వచ్చే మహమ్మారులను అడ్డుకోవడానికి ఈ పరిశోధన ఎంతో సహాయపడుతుందని శాస్త్రవేత్తలు తెలిపారు.