SS: పెనుకొండ ప్రభుత్వ డిగ్రీ కళాశాలలో ప్రపంచ పుస్తక దినోత్సవం గురువారం ఘనంగా నిర్వహించారు. కళాశాల ప్రిన్సిపల్ జయప్ప మాట్లాడుతూ.. పుస్తకాల ప్రాముఖ్యతను వివరించి, విద్యార్థులు పఠనాన్ని అలవాటు చేసుకోవడం ద్వారా జ్ఞానాన్ని పెంపొందించుకోవచ్చని సూచించారు. గ్రంథాలయ వినియోగాన్ని పెంచేందుకు విద్యార్థులు ముందుకు రావాలని కోరారు. అనంతరం బహుమతులు ప్రదానం చేశారు.