HNK: తనపై, ప్రభుత్వంపై విమర్శలు చేస్తున్న ప్రతిపక్ష పార్టీలపై ఎమ్మెల్యే నాయిని రాజేందర్ రెడ్డి తీవ్రంగా స్పందించారు. కాజీపేటలో మీడియాతో ఆయన మాట్లాడుతూ.. గత పది సంవత్సరాలలో ఎన్ని నిధులు తెచ్చారో, తాను ఎమ్మెల్యేగా అయ్యాక ఎంత అభివృద్ధి నిధులు తీసుకొచ్చానో బహిరంగ చర్చకు సిద్ధమా అని సవాల్ విసిరారు. ప్రజా ప్రభుత్వానికి ప్రజలు అండగా నిలవాలని కోరారు.