ప్రకాశం: సింగరాయకొండలోని అంబేద్కర్ గురుకుల పాఠశాలను మంత్రి స్వామి గురువారం సందర్శించారు. పాఠశాలలో విద్యాబోధన, ఆహార వసతులపై, విద్యార్థునులను అడిగి తెలుసుకున్నారు. వేసవి సెలవుల్లో విజ్ఞానం పెంపొందించే పుస్తకాలు చదవాలని విద్యార్థినులకు సూచించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ.. గురుకుల పాఠశాలల్లో మెరుగైన సౌకర్యాలకు కోట్లాది రూపాయల వేచ్చిస్తున్నట్లు తెలిపారు.