కోనసీమ: మండపేట మండలం జెడ్. మేడపాడు గ్రామంలో శ్రీదేవి, భూదేవి సమేత శ్రీ కేశవస్వామి విగ్రహ ప్రతిష్టా మహోత్సవం గురువారం అంగరంగ వైభవంగా నిర్వహించబడింది. మూడు రోజుల పాటు ప్రత్యేక పూజలు, హోమాల అనంతరం గురువారం విగ్రహ ప్రతిష్టతో పూర్తయింది. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిధిగా ఎమ్మెల్యే వేగుళ్ళ జోగేశ్వరరావు పాల్గొని విశేష పూజలు నిర్వహించారు.