WGL: పర్వతగిరి మండలం జమలాపురం గిరిజన సంక్షేమ గురుకుల బాలికల పాఠశాల, కళాశాలలో సంక్షేమ వారోత్సవాల భాగంగా తల్లిదండ్రులు-ఉపాధ్యాయులు గురువారం సమావేశం నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అసిస్టెంట్ డైరెక్టర్ అగ్రికల్చర్ జీ. నరసింగం, మండల అగ్రికల్చర్ అధికారి ప్రశాంత్ హాజరై విద్యార్థుల ఉత్తీర్ణతను అభినందించారు. ఉత్తమ ప్రతిభ కనబరిచిన విద్యార్థులను సన్మానించారు.