NLG: కాంగ్రెస్ ప్రభుత్వం అమల్లోకి తెచ్చిన యూరియా యాప్ను రైతు ప్రయోజనాల దృష్ట్యా తక్షణమే రద్దు చేయాలని, రైతు బంధు సమితి నల్గొండ జిల్లా మాజీ అధ్యక్షుడు శ్రీనివాస్ రెడ్డి కోరారు. ఈ మేరకు హైకోర్టులో గురువారం రైతులతో కలిసి నల్లగొండలో పిల్ దాఖలు చేసినట్లు తెలిపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులను ఆదుకోవడంలో కాంగ్రెస్ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.