AP: సింహాచల క్షేత్రంలో శ్రీ వరాహ లక్ష్మీనరసింహస్వామి నిజరూప దర్శనం భక్తులకు కనువిందు చేస్తోంది. సా.2:30 గంటలకే సుమారు 70 వేల మంది భక్తులు స్వామివారిని దర్శించుకున్నారు. ప్రత్యేక దర్శనాలతో పాటు ధర్మ దర్శనం లైన్లలో భక్తులు క్రమశిక్షణతో వేచి ఉన్నారు. ఎండ వేడి దృష్ట్యా క్యూలైన్లలోనే మజ్జిగ, తాగునీరు, పాలు పంపిణీ చేస్తూ దేవస్థానం అన్ని ఏర్పాట్లు చేసింది.