RR: శంకర్పల్లి అరుణోదయ యూత్ క్లబ్ ప్రెసిడెంట్ కాసెట్టి చంద్రమోహన్ ఆధ్వర్యంలో ఇవాళ యూత్ క్లబ్ మాజీ ప్రెసిడెంట్ లక్ష్మీకాంత్ రెడ్డి జ్ఞాపకార్థం బ్యాట్మెంటన్ టోర్నమెంట్ను నిర్వహించారు. విజేతలకు మున్సిపల్ ఛైర్మన్ సాత ప్రవీణ్ కుమార్, కాంగ్రెస్ సీనియర్ నాయకులు గోపాల్ రెడ్డి, ప్రకాష్ గుప్తా బహుమతులను అందజేశారు. ఈ కార్యక్రమంలో క్లబ్ సభ్యులు, నాయకులు పాల్గొన్నారు.