ATP: సెన్సెస్-2027 స్వీయ గణన నమోదులో గుంతకల్ ఎమ్మెల్యే గుమ్మనూరు జయరాం స్వీయ గణన నమోదును చేసుకున్నారు. ఎమ్మెల్యే మాట్లాడుతూ.. గణన నమోదు గురించి ఎటువంటి అపోహలొద్దని, ప్రతి ఒక్కరు స్వయంగా నమోదును చేసుకోవాలని పట్టణ ప్రజలకు సూచించారు. ఈ కార్యక్రమంలో తహశీల్దార్ రమాదేవి, మున్సిపల్ కమిషనర్ లక్ష్మీదేవి పాల్గొన్నారు.