VZM: నెల్లిమర్ల నగరపంచాయతీ పరిధి 6,7 వార్డులో తాగునీటి సమస్య పరిష్కరించాలని స్థానికులు కోరుతున్నారు. ఈ మేరకు మాజీ కౌన్సిలర్, BJP మండల అధ్యక్షులు మైపాడ ప్రసాద్‌కి స్థానిక మహిళలు మంగళవారం విన్నవించారు. ప్రతి వేసవిలో 6,7 వార్డులు, గొల్లవీధిలో తాగునీటి ఎద్దడి ఏర్పడుతుందని, అధికారులు శాశ్వత ప్రాతిపదిన చర్యలు చేపట్టడం లేదని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.