KNR: ఈనెల 14 నుండి 20 వరకు నిర్వహిస్తున్న జాతీయ అగ్నిమాపక వారోత్సవాలలో భాగంగా కరీంనగర్ జిల్లా అగ్నిమాపక శాఖ సిబ్బంది నగరంలో అగ్నిమాపక శకటాల ర్యాలీని నిర్వహించారు. జిల్లా అగ్నిమాపక అధికారి ఎం.శ్రీనివాసరెడ్డి ఆధ్వర్యంలో 40 మంది సిబ్బంది, 11 వాహనాలు పది కిలోమీటర్ల మేర ర్యాలీ నిర్వహించాయి. ఈ సందర్భంగా అధికారి మాట్లాడుతూ.. ప్రజలను అప్రమత్తం చేసేందుకు ర్యాలీ నిర్వహించామన్నారు.