NRPT: నమోదైన ప్రతి కేసులో విచారణ పారదర్శకంగా చేపట్టాలని ఎస్పీ డాక్టర్ వినీత్ అధికారులకు సూచించారు. మంగళవారం నారాయణపేట ఎస్పీ కాన్ఫరెన్స్ హాలులో నేర సమీక్ష సమావేశం నిర్వహించారు. పెండింగ్ కేసుల వివరాలను అడిగి తెలుసుకున్నారు. బాధితుల సౌకర్యం కోసం ఇంటి వద్ద ఆన్లైన్ ఎస్ఐఆర్ నమోదు చేయాలని, నేరాల నియంత్రణకు కృషి చేయాలని చెప్పారు.