కరీంనగర్ రూరల్ మండలంలోని నగునూరు, ఏలబోతారం, చామన్ పల్లి తదితర గ్రామాల్లో వరిధాన్యం కొనుగోలు కేంద్రాలను సుడా ఛైర్మన్ కోమటిరెడ్డి నరేందర్ రెడ్డి ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ.. రైతులకు ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లు చేసిందని పేర్కొన్నారు. తూకం వేసిన వెంటనే ధాన్యాన్ని మిల్లులకు తరలించాలని ఆయన అధికారులను ఆదేశించారు.