NZB: క్షేత్రస్థాయిలో పనిచేస్తున్న ప్రొఫెషనల్ జర్నలిస్టులందరికీ అక్రిడిటేషన్లు అందజేస్తామని రాష్ట్ర మీడియా అకాడమీ ఛైర్మన్ శ్రీనివాస్ రెడ్డి హామీ ఇచ్చారు. బుధవారం ఆయన NZBలో మాట్లాడుతూ.. ప్రభుత్వం రూపొందించిన విధివిధానాల ప్రకారమే అక్రిడిటేషన్ కార్డుల పంపిణీ జరుగుతుందన్నారు. ప్రస్తుత మీడియా పోకడలపై శ్రీనివాస్ రెడ్డి తీవ్ర విశ్లేషణ చేశారు.