నిర్మల్ పట్టణంలోని కంచరోని చెరువులో గుర్రపు డెక్క పెరిగిపోయింది. కాగా బుధవారం మున్సిపల్ వైస్ ఛైర్మన్ అప్పాల గణేష్ చక్రవర్తి స్థానిక గంగపుత్ర సంఘ సభ్యులతో కలిసి చెరువును పరిశీలించారు. చెరువు శుభ్రత కోసం చేపట్టిన గుర్రపుడెక్క తొలగింపు పనులను మున్సిపల్ అధికారులతో సమీక్షించారు. అనంతరం చెరువును త్వరితగతిన శుభ్రపరచాలని ఆదేశాలు జారీ చేశారు.