గుంటూరు ఆర్. అగ్రహారంలోని శ్రీ గంగా భ్రమరాంబా సమేత మల్లేశ్వర స్వామి దేవస్థానంలో ధర్మకర్తల ప్రమాణ స్వీకార కార్యక్రమం బుధవారం ఘనంగా జరిగింది. ఈ కార్యక్రమంలో గుంటూరు వెస్ట్ ఎమ్మెల్యే గళ్ళా మాధవి పాల్గొని ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం ధర్మకర్తలతో ప్రమాణ స్వీకారం చేయించారు. మొత్తం ఎనిమిది మంది సభ్యులు ధర్మకర్తలుగా బాధ్యతలు స్వీకరించారు.