దివ్యాంగ ప్రయాణికులకు భారతీయ రైల్వే గుడ్ న్యూస్ తెలిపింది. కేంద్ర ప్రభుత్వం జారీ చేసే యూనిక్ డిసెబిలిటీ ఐడెంటిటీ కార్డ్ (UDID) ఉన్నవారు ఇకపై రైళ్లలోని ప్రత్యేక కోచ్లలో ఎటువంటి ఇబ్బంది లేకుండా ప్రయాణించవచ్చు. ఈ నిర్ణయంతో దివ్యాంగుల రైల్వే ప్రయాణం మరింత సులభతరం కానుంది. ఇతర గుర్తింపు పత్రాల అవసరం లేకుండా, కేవలం UDID కార్డుతో సులభంగా ప్రయాణించవచ్చు.