HYDలో మూసా, ఈసా నదులు లంగర్ హౌజ్ వద్ద త్రివేణి సంగమంలో కలుస్తాయి. జంట జలాశయాల నుంచి సంగమం వరకు ఈ 21 కి.మీ నదీ పరివాహక ప్రాంతాన్ని అభివృద్ధి చేసేందుకు ప్రభుత్వం తొలి దశలో సుమారు రూ.7,000 కోట్ల వ్యయంతో ప్రణాళిక సిద్ధం చేసింది. ఇప్పటికే డీపీఆర్ రూపొందించి ప్రజల సూచనలు, నిపుణుల సలహాలు స్వీకరిస్తోంది.