GDWL: ఈ నెల 24న మున్సిపల్ కౌన్సిల్ ప్రత్యేక సమావేశం నిర్వహించనున్నట్లు కమిషనర్ సైదులు తెలిపారు. మున్సిపల్ కార్యాలయ సమావేశ మందిరంలో జరిగే ఈ భేటీకి ఛైర్మన్, కౌన్సిలర్లు తప్పనిసరిగా హాజరుకావాలని కోరారు. సమావేశం అనంతరం ఆరుగురు కో-ఆప్షన్ సభ్యుల ఎంపిక ప్రక్రియ నిర్వహించనున్నట్లు వెల్లడించారు. ఇందుకు సంబంధించిన దరఖాస్తులు ఇప్పటికే అందాయని తెలిపారు.